తొర్రూరు కాంగ్రెస్‌ మండల, పట్టణ కమిటీల ప్రకటన

తొర్రూరు (ప్రజానేస్తం జ్వాల): తొర్రూరు మండల, పట్టణ కాంగ్రెస్‌ పార్టీ నూతన కమిటీలను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రకటించారు. పాలకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కమిటీ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు.