జాతీయ సదస్సుకు కేయూ అధ్యాపకుడు డా. సంకినేని పరిశోధనా పత్రం ఎంపిక
హనుమకొండ, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): హైదరాబాద్‌లో అక్టోబర్ 30, 31 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ సదస్సుకు కాకతీయ విశ్వవిద్యాలయ రాజనీతి శాస్త్ర సీనియర్ అధ్యాపకుడు డా. సంకినేని వెంకటయ్య పరిశోధనా పత్రం ఎంపికైంది. ‘ఆర్థిక వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ప్రజా విధానం’ ప్రధానాంశంగా జరిగే సదస్సులో ఆయన ‘గ్రామీణాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన’ అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. ప్రస్తుతం ఆయన కేయూ ఉమెన్స్ పీజీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. పరిశోధనా పత్రం ఎంపిక కావడంపై వర్సిటీ వర్గాలు అభినందనలు తెలిపాయి.