కేయూ ఆర్ట్స్ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు

హనుమకొండ, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో పీజీ కోర్సుల స్పాట్ అడ్మిషన్లకు నవంబర్ 3 వరకు గడువు ఉందని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి తెలిపారు. ఎంఏ హిందీ, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంకాం, ఎంఎస్సీ వృక్షశాస్త్రం, రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ తదితర కోర్సుల్లో 154 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సీపీగెట్‌ పరీక్ష రాసినవారు, రాయని అర్హులైన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలను సంప్రదించాలని సూచించారు.