నిట్ వరంగల్‌లో నేటి నుంచి ‘టెక్నోజియన్–26’
హనుమకొండ, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): నిట్ వరంగల్‌లో అక్టోబర్ 30, 31 తేదీల్లో వార్షిక సాంకేతిక ఉత్సవం ‘టెక్నోజియన్–26’ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభోత్సవం జరగనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 50కి పైగా సాంకేతిక పోటీలు, రోబోటిక్స్ ఛాలెంజ్‌లు, స్టార్టప్ ఆలోచనల ప్రదర్శనలు, సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్లు నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ విద్యాసంస్థలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు, యువ ఆవిష్కర్తలు పాల్గొననున్నారు.