హుజూర్‌నగర్‌లో మున్సిపల్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌పై కొరడా
ముగ్గురు అధికారులపై క్రమశిక్షణా చర్యలకు కలెక్టర్ ఆదేశాలు క్రిమినల్ ఫిర్యాదుకు ఆదేశం.. అవుట్‌సోర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తొలగింపు సూర్యాపేట, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్‌నగర్ మున్సిపాలిటీకి చెందిన భూమిని ప్రైవేట్ వ్యక్తుల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ కీలక చర్యలకు ఆదేశించారు. మున్సిపల్ ఆస్తి పన్ను రికార్డులను అక్రమంగా సృష్టించి, వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంలో సంబంధిత అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు, క్రిమినల్ ఫిర్యాదు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. హుజూర్‌నగర్‌లో సుమారు 192 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న మున్సిపల్ బావి,...