గోపాలపురానికి గ్రామకంఠం కేటాయించాలి
దశాబ్దాల భూ రికార్డుల సమస్యకు పరిష్కారం చూపాలి.. జిల్లా కలెక్టర్‌కు ఐఎన్టీయూసీ నేత గురవయ్య గౌడ్ విజ్ఞప్తి హుజూర్నగర్, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామానికి తక్షణమే అధికారికంగా గ్రామకంఠం కేటాయించి, భూ రికార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి గ్రామస్తులకు న్యాయం చేయాలని ఐఎన్టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య గౌడ్ జిల్లా కలెక్టర్‌ను కోరారు. గ్రామంలోని దేవాదాయ, పట్టా, ప్రభుత్వ భూములకు సంబంధించిన రికార్డులను సమగ్రంగా పరిశీలించి అవసరమైన సవరణలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్రామస్తుల వినతి గత ఏడాది గోపాలపురం గ్రామస్తులు మంత్రి కెప్టెన్ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి గ్రామంలోని...