పట్టభద్రుల ఓటరు నమోదు కోసం ముందడుగు వేసిన సర్పంచ్ బొల్లెపల్లి రామనాథం
కీతవారిగూడెం పట్టభద్రుల తరఫున 20 దరఖాస్తుల సమర్పణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేలా చొరవ గరిడేపల్లి, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): కీతవారిగూడెం గ్రామ పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించే ప్రక్రియలో గ్రామ సర్పంచ్ బొల్లెపల్లి రామనాథం చొరవ తీసుకున్నారు. పట్టభద్రుల నూతన ఓటరు నమోదు కోసం అవసరమైన దరఖాస్తులను సిద్ధం చేయించి, గురువారం గరిడేపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించారు. గ్రామానికి చెందిన పట్టభద్రుల వివరాలతో మీ సేవ కేంద్రం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు నమోదు చేయించి, గెజిటెడ్ అధికారి సంతకాలు పొందిన అనంతరం మొత్తం 20 దరఖాస్తులను సంబంధిత తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్‌కు అందజేశారు. పట్టభద్రులు...