బీఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి పిల్లుట్ల రఘు ఆర్థిక చేయూత!

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం.. కష్టకాలంలో ఆదుకుంటాం బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త సంక బుడ్డి సైదులు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత కల్లూరు, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని బీఆర్‌ఎస్ హుజూర్‌నగర్ నియోజకవర్గ నాయకులు పిల్లుట్ల రఘు భరోసా ఇచ్చారు. నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త సంక బుడ్డి సైదులు ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు పిల్లుట్ల రఘు ముందుకొచ్చారు. పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు గురువారం కల్లూరు గ్రామానికి వెళ్లిన బీఆర్‌ఎస్ పార్టీ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, హుజూర్‌నగర్ నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు...