ప్రతి పేదవాడి సొంతింటి కలే లక్ష్యం.. ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేద కుటుంబాల్లో కొత్త వెలుగులు

రాయినిగూడెంలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ పేదల జీవితాల్లో భరోసా నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం: గుండు రామాంజిగౌడ్ రాయినిగూడెం, అక్టోబర్ 29 (ప్రజానేస్తం జ్వాల): పేదవాడికి సొంతిల్లు కేవలం కల మాత్రమే కాదు.. అది ఆత్మగౌరవానికి ప్రతీక! ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల జీవితాల్లో కొత్త ఆశలు నింపుతోంది. ఈ క్రమంలో సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయినిగూడెం గ్రామ సర్పంచ్, సూర్యాపేట జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు **గుండు...