తీవ్ర కరువు జాబితాలో హుజూర్నగర్ నియోజకవర్గంలోని రెండు మండలాలు!
పాలకీడు, చింతలపాలెం మండలాలకు కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తింపు • జీవో ఎంఎస్ నంబర్ 03 ద్వారా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట జిల్లా, ప్రజానేస్తం జ్వాల: హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాలను తెలంగాణ ప్రభుత్వం తీవ్ర కరువు ప్రభావిత ప్రాంతాల జాబితాలో చేర్చింది. పాలకీడు, చింతలపాలెం మండలాలను తీవ్ర కరువు మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ నంబర్ 03 ద్వారా ప్రకటించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ రెండు మండలాలకు ప్రభుత్వ గుర్తింపు లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కరువు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయక చర్యలు అందనున్నాయనే అంశంపై ఆసక్తి నెలకొంది.