పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో సేవా కార్యక్రమం

అమరుల స్ఫూర్తితో రక్తదానం.. 101 యూనిట్ల రక్తం సేకరణ స్వయంగా రక్తదానం చేసిన వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ వరంగల్, అక్టోబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, రెడ్‌క్రాస్ సంస్థ సహకారంతో భీమారంలోని శుభం ఫంక్షన్ హాల్‌లో మంగళవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం **101 యూనిట్ల రక్తాన్ని సేకరించారు.** అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ సేవా కార్యక్రమం మానవత్వానికి ప్రతీకగా నిలిచింది. ఈ శిబిరంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పోలీస్ అధికారులు, సిబ్బంది...