చిల్లర చిచ్చు.. మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టిన ప్రయాణికురాలు
బస్సు వెనుక టైర్ల కింద పడి కండక్టర్‌కు రెండు కాళ్లు విరుగు.. చిల్లర వివాదం తీవ్ర విషాదానికి దారితీరు మణుగూరు, అక్టోబర్ 26 (ప్రజానేస్తం జ్వాల): చిల్లర విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళా బస్సు కండక్టర్‌కు తీవ్ర గాయాలయ్యేలా చేసింది. చిల్లర వెంటనే ఇవ్వలేదన్న ఆగ్రహంతో ఓ ప్రయాణికురాలు మహిళా కండక్టర్‌ను బస్సు నుంచి కిందకు నెట్టివేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద కలకలం రేపింది. ఈ ఘటనలో కండక్టర్ ప్రవళిక రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం. రూ.10 టికెట్.. రూ.100 నోటుతో మొదలైన వివాదం వివరాల్లోకి వెళ్తే.. అశ్వాపురం మండలం మిట్టగూడెంకు చెందిన మౌనిక తన కుమారుడితో కలిసి మణుగూరు...