కోర్టులో ఉన్న భూ వివాదంపై విలేకరి జోక్యం ఎందుకు?

•తుది తీర్పు రాకముందే వార్తలు రాయడంపై ప్రశ్నలు •ఎంఆర్ఓ సంతకం చేసిన పంచనామాలో ఆర్‌ఐపైనే ఆరోపణలెందుకు? •ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని రైతు విజ్ఞప్తి సూర్యాపేట ప్రజా నేస్తం జ్వాల న్యూస్,అక్టోబర్ 23: న్యాయస్థానంలో విచారణలో ఉన్న సివిల్‌ భూ వివాదంపై తుది తీర్పు వెలువడకముందే ఓ పత్రికా విలేకరి జోక్యం చేసుకుంటూ పోలీస్‌, రెవెన్యూ అధికారులపై ప్రభావం చూపేందుకు ప్రయత్నించారని పెంచికలదిన్నె గ్రామానికి చెందిన రైతు రామారావు ఆరోపించారు. కోర్టులో తేలాల్సిన అంశాలపై ఒక పక్షం వాదనల ఆధారంగా వార్తలు రాయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరారు. కోర్టులో ఉన్న వివాదంపై ముందస్తు తీర్పులా?...