పోలీస్ అమరవీరులకు ఘన నివాళులు
మహబూబాబాద్, అక్టోబర్ 21 (ప్రజానేస్తం జ్వాల): పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫ్లాగ్ డే కార్యక్రమాన్ని గౌరవప్రదంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పోలీస్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల సేవలను స్మరించుకుంటూ వారి త్యాగాలకు గౌరవ వందనం చేశారు. జిల్లా ఎస్పీ శబరీష్, కలెక్టర్ స్నేహ శబరీష్ కార్యక్రమంలో పాల్గొని అమరవీరుల కుటుంబాల పట్ల గౌరవం, కృతజ్ఞత వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, దేశ రక్షణ కోసం పోలీసులు అందించిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. పోలీస్...