పద్మాక్షి కాలనీలో 70 అడుగుల రావణ దహనం

హనుమకొండ, అక్టోబర్ 20 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండలోని పద్మాక్షి కాలనీలో రావణ దహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ రావణాసురుడి ప్రతిమను బాణసంచా వెలుగుల మధ్య దహనం చేశారు. రావణ దహనాన్ని తిలకించేందుకు కాలనీవాసులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బాణసంచా వెలుగులు, జై శ్రీరామ్ నామస్మరణలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలతో పద్మాక్షి కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.