ఈత బుంగలు ధ్వంసం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

భీమదేవరపల్లి, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామ శివారులోని తురకవారి కుంట వద్ద ఉన్న ఈతవనంలో ఈత బుంగలను ధ్వంసం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గౌడ కులస్తులు పోలీసులను కోరారు. భీమదేవరపల్లి గ్రామానికి చెందిన గౌడ కులస్తులు వేలం పాట ద్వారా ఈ ఈతవనాన్ని దక్కించుకున్నారని, ఈత చెట్ల నుంచి వచ్చే ఆదాయమే తమకు ప్రధాన జీవనాధారమని తెలిపారు. అయితే గత మూడు రోజులుగా రాత్రి వేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఈత చెట్లకు ఉన్న ఈత బుంగలను పగలగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తమకు ఆర్థికంగా నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు....