కాకతీయ యూనివర్సిటీలో 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి

హనుమకొండ, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): కాకతీయ విశ్వవిద్యాలయంలోని 21 విభాగాల్లో ఖాళీగా ఉన్న 49 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అత్యధికంగా జువాలజీ విభాగానికి ఆరు పోస్టులు, ఇంగ్లీష్, కామర్స్, ఎకనామిక్స్ విభాగాలకు ఐదేసి పోస్టులు కేటాయించారు. విశ్వవిద్యాలయంలో మొత్తం 68 పోస్టులు ఖాళీగా ఉండగా, తొలి విడతలో 49 పోస్టుల భర్తీకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ లెక్చరర్ల కొనసాగింపు నేపథ్యంలో మిగిలిన పోస్టుల భర్తీకి అనుమతి లభించలేదు. తాజా నిర్ణయంతో విశ్వవిద్యాలయంలో అధ్యాపకుల కొరత కొంతమేర తగ్గుతుందని విద్యావర్గాలు భావిస్తున్నాయి.