కాజీపేటలో గంజాయి విక్రయ ముఠా అరెస్ట్
హనుమకొండ, అక్టోబర్ 19 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): కాజీపేట రైల్వే స్టేషన్ ఎదుట ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను కాజీపేట పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 500 గ్రాముల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, అక్రమ రవాణాకు ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.4.25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో నిందితులు మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి కాజీపేటకు తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై మరిన్ని...