ఆమనగల్లు లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

•గ్రామ పెద్దల సమక్షంలో ఆనందోత్సాహాలతో పూల పండుగ వేములపల్లి, (ప్రజా నేస్తం జ్వాల) రిపోర్టర్ యస్.నరేష్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దల సమక్షంలో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఈ పూల పండుగ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. చివరి రోజైన సద్దుల బతుకమ్మ సందర్భంగా...