నేరేడుచర్ల అట్టాల ఫ్యాక్టరీ సమీపంలో రెండు బైకులు ఢీ

ఇద్దరికి స్వల్ప గాయాలు.. ప్రాణాపాయం లేదన్న 108 సిబ్బంది నేరేడుచర్ల, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని అట్టాల ఫ్యాక్టరీ సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. గరిడేపల్లి నుంచి నేరేడుచర్ల వైపు బైక్‌పై వస్తున్న ఆర్. రమేష్ (36), బద్రి (32) ప్రయాణిస్తున్న బైక్‌ మరో బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. దీంతో 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయని, ప్రాణాపాయం లేదని 108 సిబ్బంది తెలిపినట్లు సమాచారం.