సూర్యాపేట జిల్లా బీజేవైఎం కార్యదర్శిగా నర్సింగ్ వినయ్ కుమార్ గౌడ్

35 మందితో జిల్లా కార్యవర్గం ప్రకటన.. యువత సేవే లక్ష్యంగా ముందడుగు! సూర్యాపేట, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) సూర్యాపేట జిల్లా కార్యవర్గాన్ని 35 మందితో ఆదివారం ప్రకటించారు. ఇందులో భాగంగా జిల్లా కార్యదర్శిగా నర్సింగ్ వినయ్ కుమార్ గౌడ్‌ను నియమించినట్లు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు గుణగంటి పృథ్వి గౌడ్ వెల్లడించారు. యువతను సామాజిక సేవ వైపు నడిపించడం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయనుంది. స్వామి వివేకానంద ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడంతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేయడంపై...