కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అడిషనల్ కలెక్టర్ కె. వెంకటరెడ్డి
కుటుంబ సమేతంగా స్వామివారికి అభిషేకం.. అమ్మవారికి కుంకుమార్చన భీమదేవరపల్లి, అక్టోబర్ 18 (ప్రజా నేస్తం జ్వాల): భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. వెంకటరెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన గావించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణ అధికారి పి. కిషన్‌రావు పర్యవేక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాల వేళ...