27 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన స్నేహితులు
కీతవారిగూడెంలో 1998–99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చిన్ననాటి జ్ఞాపకాలకు మళ్లీ జీవం.. గురువులకు ఘన సత్కారం.. స్నేహబంధానికి అరుదైన వేడుక! కీతవారిగూడెం (ప్రజానేస్తం జ్వాల): కాలం మారింది.. చదువులు పూర్తయ్యాయి.. ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబ బాధ్యతలతో ఎవరి జీవితాల్లో వారు బిజీ అయ్యారు. కానీ చిన్ననాటి స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు! అక్షరాలు నేర్చిన పాఠశాల.. ఆటపాటలతో గడిపిన తరగతి గదులు.. గురువుల మందలింపులు.. స్నేహితులతో పంచుకున్న మధుర జ్ఞాపకాలు.. ఇవన్నీ మరోసారి కళ్లముందు కదలాడాయి. దాదాపు 27 ఏళ్ల విరామం తర్వాత కీతవారిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1998–99 విద్యా సంవత్సరంలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒక్కచోట చేరి ఆత్మీయ సమ్మేళనాన్ని...