రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఐజీ అంబర్ కిషోర్ ఝా
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, అక్టోబర్ 18(ప్రజానేస్తం జ్వాల): రెబ్బెన పోలీస్ స్టేషన్‌ను కాళేశ్వరం జోన్–I డీఐజీ అంబర్ కిషోర్ ఝా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డులు, సీసీటీఎన్ఎస్ వ్యవస్థ, వివిధ విభాగాల పనితీరును పరిశీలించి, శాంతిభద్రతలు, నమోదైన కేసులు, పెండింగ్ కేసుల పురోగతిపై సమీక్షించారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ మర్యాదపూర్వక సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచి, ఆకస్మిక వాహన తనిఖీలతో విజిబుల్ పోలీసింగ్‌ను పటిష్టం చేయాలని ఎస్ఐ ఏ. వెంకటకృష్ణకు ఆదేశించారు