సద్దుల బతుకమ్మ వేళ వరంగల్ బస్టాండ్‌లో ప్రయాణికుల రద్దీ

హనుమకొండ, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్‌): సద్దుల బతుకమ్మ పండుగ, ఆదివారం సెలవు నేపథ్యంలో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. పండుగను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జరుపుకునేందుకు మహిళలు, ఇతర ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని పలువురు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. పండుగ సమయాల్లో ముందస్తు ప్రణాళికతో అదనపు బస్సులు, ట్రిప్పులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరారు.