లలితా త్రిపురసుందరి అలంకారంలో శృంగేరి శారదాపీఠం అమ్మవారు
హనుమకొండ, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): వరంగల్లోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో దుర్గాష్టమి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ శారదా అమ్మవారు లలితా త్రిపురసుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.