ప్రైవేటు లాడ్జిలో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య.. సూసైడ్‌ నోట్‌లో పలువురి పేర్లు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాల్వంచలో సివిల్‌ సప్లైస్‌ శాఖ గ్యాస్‌ గోడౌన్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ తహసీల్దార్‌ అనంతలక్ష్మీనారాయణ ఓ ప్రైవేటు లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. తన మృతికి పలువురు కారణమంటూ ఆయన రాసినట్లు చెబుతున్న సూసైడ్‌ నోట్‌లో ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ పేరుతో పాటు కొందరు వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా కలిసి తనను రూ. కోటి డిమాండ్‌ చేశారని, డబ్బులు ఇవ్వకపోతే తనపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నారని సమాచారం. అయితే, సూసైడ్‌ నోట్‌లోని ఆరోపణలు స్వతంత్రంగా ధ్రువీకరించబడాల్సి...