దుర్గమ్మ సన్నిధిలో అన్నదానం.. భక్తులకు సేవ
గరిడేపల్లి, అక్టోబర్ 18 (ప్రజానేస్తం జ్వాల): దుర్గమ్మ సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం అందించాలనే సంకల్పంతో మణికంఠ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎంపీపీ, మాజీ జడ్పీటీసీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, గరిడేపల్లి గ్రామ సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. అన్నదానం ఆధ్యాత్మికతతో పాటు సేవాభావానికి, సామాజిక బాధ్యతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.