అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం సౌండ్ సిస్టమ్ అందజేత

పొనుగోడు, అక్టోబర్‌ 18 (ప్రజానేస్తం జ్వాల): పొనుగోడు గ్రామంలో అయ్యప్ప మాలధారణ చేసిన 100 మందికి పైగా స్వాములు శ్రీశ్రీశ్రీ త్రిలింగేశ్వర ఆలయంలో ఉంటూ ప్రతిరోజూ అయ్యప్ప పూజలు, భజనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్ సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని గుర్తించిన పొనుగోడు మెయిన్ రోడ్డుకు చెందిన గణేష్ యూత్ కమిటీ సభ్యులు చొరవ తీసుకున్నారు. అయ్యప్ప పూజలు, భజనలకు ఉపయోగపడేలా 240 వాట్ల బోట్ పార్టీ పాల్ స్పీకర్, 600 ప్లస్ బిగ్ స్పీకర్, వైర్‌లెస్ మైక్‌లను గురుస్వామి యర్రంశెట్టి వెంకన్నకు అందజేశారు. అయ్యప్ప స్వాములకు అవసరమైన సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చిన గణేష్ యూత్ కమిటీ సభ్యులను భక్తులు అభినందించారు....