కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను విజయవంతం చేయాలి: డీఎంహెచ్‌వో

హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): హనుమకొండ జిల్లాలో అక్టోబర్ 22 నుంచి నవంబర్ 4 వరకు నిర్వహించనున్న కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను విజయవంతం చేయాలని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ విజయ నిర్మల, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి వ్యాధి అనుమానితులను గుర్తించాలని సూచించారు. శరీరంపై స్పర్శ తెలియని మచ్చలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాధిని తొలిదశలో గుర్తించి చికిత్స అందించడం ద్వారా వ్యాప్తిని...