విదేశీయుల వివరాలు నమోదు చేయకుంటే రూ.లక్ష జరిమానా!

హనుమకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మారెల్లి కిరణ్): వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విదేశీ పౌరులకు వసతి కల్పించే హోటళ్లు, లాడ్జిలు, ప్రైవేట్‌ హాస్టళ్లు, అద్దె ఇళ్ల యజమానులు వారి వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌. శ్వేత ఆదేశించారు. విదేశీయుల రాకపోకల వివరాలను 24 గంటల్లోగా ఫారమ్‌-III ద్వారా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. విదేశీయులకు ప్రవేశం కల్పించే విద్యాసంస్థలు, చికిత్స అందించే వైద్య సంస్థలు సైతం ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా నిబంధనల అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. విదేశీయుల...