బతుకమ్మ వేడుకల్లో వివక్ష ఆరోపణలు.. విచారణకు డిమాండ్

కొత్తకొండ, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): యాదాద్రి భువనగిరి జిల్లా టి.రేపాకలో బతుకమ్మ వేడుకల సందర్భంగా దళిత మహిళల పట్ల కులవివక్షకు పాల్పడిన ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ డిమాండ్ చేశారు. ఆరోపణలు నిర్ధారణ అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని కోరారు. కొత్తకొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, మహిళల ఐక్యతకు ప్రతీక అని, అలాంటి వేడుకల్లో కులవివక్షకు తావులేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 17 అంటరానితనాన్ని నిషేధించిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఘటనపై నిజనిర్ధారణ చేపట్టి బాధిత మహిళలకు...