కొమురం భీం విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యే కోవా లక్ష్మికి ఆహ్వానం

ఇంద్రవెల్లి, అక్టోబర్‌ 17 (ప్రజానేస్తం జ్వాల): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని చారిత్రక పోరాట గడ్డపై ఈ నెల 23న నిర్వహించనున్న ఆదివాసీ వీరుడు కొమురం భీం విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరుకావాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం ‘జల్‌–జంగల్‌–జమీన్‌’ నినాదంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమురం భీం త్యాగాలు, పోరాట స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పే లక్ష్యంతో ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ చారిత్రక కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మిని ఆహ్వానించిన వారిలో...