యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
కాజీపేట, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ నాయకులు విమర్శించారు. యువతకు ఇచ్చిన హామీలను విస్మరించి, నిరుద్యోగ యువత ఆశలపై నీళ్లు చల్లిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం నాయకులు ఆందోళన చేపట్టారు. బీజేపీ, బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షులు పున్నం వేణు ఆధ్వర్యంలో కాజీపేట జంక్షన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డితో కలిసి బీజేపీ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు నర్మెట్ట శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...