గ్రామపంచాయతీ సిబ్బందికి పండుగ కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ బిల్లా యాదగిరి
వేలేరు, అక్టోబర్ 17 (ప్రజానేస్తం జ్వాల): గ్రామ పరిశుభ్రతే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తున్న గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తించి, వారి పట్ల గౌరవాభిమానాలను చాటుకున్నారు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి. సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని గ్రామపంచాయతీకి చెందిన 18 మంది సిబ్బందికి నూతన వస్త్రాలను పంపిణీ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ బిల్లా యాదగిరి మాట్లాడుతూ.. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో గ్రామపంచాయతీ సిబ్బంది చేస్తున్న కృషి, అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా గ్రామ పారిశుధ్యం కోసం నిరంతరం శ్రమిస్తున్న సిబ్బంది సేవలు...