పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు.. నేరస్తులకు శిక్ష పడేలా దర్యాప్తు చేయాలి!

ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మాడావి మనోహర్): పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్, ఐపీఎస్, పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా ఆధారాలను పకడ్బందీగా సేకరించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ పోలీస్ అధికారులతో కేసుల పురోగతి, నేర నియంత్రణ చర్యలు, శాంతిభద్రతల పరిరక్షణపై సమీక్షించారు. కేసుల విచారణలో అనవసర జాప్యం చేయకుండా అధికారులు బాధ్యతాయుతంగా...