జంగుబాయి ఆలయానికి శాశ్వత రహదారి నిర్మించాలి!
ఆసిఫాబాద్, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి మాడావి మనోహర్): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కోట పారాందోలి మహారాజ్గూడలోని రైథడ్ జంగుబాయి దేవస్థానానికి వెళ్లే రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని భక్తులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గిరిజన భక్తులకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ పుణ్యక్షేత్రానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో ఏటా భక్తులు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్యమాసం సందర్భంగా తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు జంగుబాయి దేవస్థానాన్ని దర్శించుకుంటారు. ఈ సమయంలో రహదారి సౌకర్యం సక్రమంగా లేకపోవడం వల్ల వాహనాల...