మిర్చి అదనపు తూకం సొమ్ము రైతులకే దక్కాలి!

ఎనుమాముల, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల ప్రతినిధి: మారెల్లి కిరణ్): ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి బస్తాల్లో 49 కిలోలకు మించి వచ్చే అదనపు తూకానికి సంబంధించిన ఆదాయాన్ని మార్కెట్ కమిటీ ఖాతాలో జమ చేసి, ఆ నిధులను రైతుల సంక్షేమానికే వినియోగించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్ రావు డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగేలా తూకాల విధానంలో పారదర్శకత పాటించాలని, అదనంగా వచ్చే ఆదాయం అన్నదాతల ప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రైతు సంఘం ప్రతినిధి బృందం ఎనుమాముల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ప్రియాంకతో పాటు సంబంధిత ఉన్నతాధికారులను కలిసి సవివరమైన...