మూలా నక్షత్రం వేళ.. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
కొత్తకొండ, భీమదేవరపల్లి మండలం, అక్టోబర్ 16 (ప్రజానేస్తం జ్వాల): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారిని సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చేలా అలంకరించారు. మూలా నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ఈ పుణ్యక్షేత్రంలో భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆరో రోజు ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు. విద్య, జ్ఞానం, వివేకానికి...