గ్రామాలకు కొత్త వెలుగులు.. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ!
భీమదేవరపల్లి మండలంలో విద్యుత్ దీపాల ఏర్పాటుకు రూ.27 లక్షలు 25 ప్రాంతాల్లో దీపాలు.. బస్టాండ్లు, కాలనీలు, కూడళ్లకు ప్రాధాన్యం భీమదేవరపల్లి (ప్రజానేస్తం జ్వాల): మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో భీమదేవరపల్లి మండలంలోని గ్రామాలు, తండాలు, కాలనీల్లో విద్యుత్ దీపాల ఏర్పాటుకు నిధులు కేటాయించారు. రాత్రివేళల్లో చీకట్లను తొలగించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో వివిధ ప్రాంతాల్లో దీపాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. మండలంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాల ఏర్పాటుకు రూ.27 లక్షలు కేటాయించినట్లు వివరాలు వెల్లడిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీలు, బస్టాండ్లు, ఆటో స్టాండ్లు, అంబేద్కర్ సర్కిళ్లు, ఆలయాల పరిసరాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద దీపాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యుత్...