కీతవారిగూడెంలో ఘనంగా శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సామూహిక కుంకుమార్చన

నూతన దేవాలయంలో సామూహిక కుంకుమార్చన.. బ్రహ్మశ్రీ రాయప్రోలు శ్రీరామయ్య శర్మ మంత్రోచ్చారణల మధ్య పూజలు మహిళా భక్తులు, గ్రామ ఆడపడుచులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ ఆహ్వానం కీతవారిగూడెం (ప్రజానేస్తం జ్వాల): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలోని శ్రీ మారెమ్మ, అంకమ్మ, మద్దిరావమ్మ, శ్రీ కనకదుర్గమ్మ దేవతల ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవాలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాత సేవతో పాటు ఆరు గంటలకు అమ్మవార్లకు అభిషేకం, కుంకుమార్చన, అష్టోత్తర పూజలు నిర్వహిస్తున్నారు. జగన్మాతను వివిధ రూపాల్లో...