కాకతీయ విశ్వవిద్యాలయంలో టమాటా పంట అభివృద్ధిలో ట్రాన్స్‌జీన్ సాంకేతికతపై పుస్తకావిష్కరణ
కాకతీయ విశ్వ విద్యాలయం (ప్రజానేస్తం జ్వాల): వ్యవసాయ రంగంలో ఆధునిక జీవసాంకేతిక పరిజ్ఞానం ప్రాధాన్యాన్ని చాటిచెబుతూ, “Transgene Technology for Improvement of Cultivated Tomato” పేరుతో డాక్టర్ జి. విక్రమ్ రచించిన పుస్తకం కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించబడింది. విశ్వవిద్యాలయ వైస్‌ఛాన్సలర్ చేతుల మీదుగా, ఆయన ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిపాలనా అధికారులు పాల్గొన్నారు. టమాటా పంట అభివృద్ధికి ట్రాన్స్‌జీన్ సాంకేతికత ఎలా దోహదపడగలదనే అంశాన్ని ప్రధానంగా తీసుకొని రూపొందించిన ఈ పుస్తకం వ్యవసాయ శాస్త్రం, జీవసాంకేతిక పరిశోధనలపై ఆసక్తి ఉన్నవారికి ఉపయోగకరమైన గ్రంథంగా నిలవనుంది. ఈ సందర్భంగా రచయిత డాక్టర్ జి. విక్రమ్ తన విద్యా, పరిశోధనా ప్రయాణంలో మార్గదర్శకత్వం, ప్రోత్సాహం,...