ఇసుక రీచ్‌లలో వివక్షపై ఆరోపణలు!
📌 పేరబోయినగూడెంపై ప్రేమ.. తుంగగూడెంపై వివక్ష ఎందుకు? స్థానిక ట్రాక్టర్లకు అనుమతులేవి.. ఇతర మండలాల వాహనాలకు ప్రాధాన్యతపై ప్రశ్నలు సూర్యాపేట జిల్లా, అక్టోబర్ 6 (ప్రజానేస్తం జ్వాల):సూర్యాపేట జిల్లాలోని ఇసుక రీచ్‌ల నిర్వహణ, ట్రాక్టర్ల కేటాయింపులు, ఇసుక బుకింగ్ విధానంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జాజిరెడ్డిగూడెం, నాగారం మండలాల పరిధిలోని పేరబోయినగూడెం, తుంగగూడెం ఇసుక రీచ్‌ల మధ్య బుకింగ్ విధానం, రవాణా దూరాలు, బిల్లుల విషయంలో వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.ఇసుక రవాణా చేసే కొందరు ట్రాక్టర్ యజమానులు తమకు సమీపంలోని రీచ్ నుంచి ఇసుక కేటాయింపు జరగడం వల్ల ఒక ట్రిప్పుకు రూ.800 నుంచి రూ.1,000 వరకు మాత్రమే మిగులుతోందని, మరికొందరికి...