రూ.25 లక్షల కమ్యూనిటీ హాల్‌.. కనీస వసతులు కరువు!

📌 ప్రహరీ, విద్యుత్‌, నీటి సౌకర్యాలు లేక నిరుపయోగంగా భవనం అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని కాలనీవాసుల విజ్ఞప్తి ఆత్మకూర్ (ఎస్), అక్టోబర్ 5 | ప్రజానేస్తం జ్వాల | సూర్యాపేట జిల్లా బ్యూరో: ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ వినియోగానికి నోచుకోకుండా నిరుపయోగంగా మారింది. ఆత్మకూర్ (ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామం ఎస్సీ పడమటి గూడెం కాలనీలో 2017లో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు సుమారు రూ.25 లక్షలు వెచ్చించినప్పటికీ ప్రస్తుతం కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలు వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, ఇతర సామాజిక...