లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి డీఎంహెచ్‌వో

📌 రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వోగా కొనసాగుతున్న స్వర్ణకుమారి హైదరాబాద్‌, అక్టోబర్‌ 5: రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రూ.లక్ష లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు ఆమెను పట్టుకున్నట్లు సమాచారం.ప్రస్తుతం స్వర్ణకుమారి రంగారెడ్డి జిల్లా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా (డీఎంహెచ్‌వో) విధులు నిర్వహిస్తున్నారు. లంచం వ్యవహారంపై ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, లంచం డిమాండ్‌కు కారణాలు, ఏసీబీ అధికారులు చేపట్టిన తదుపరి చర్యలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.