మునగాలలో రూ.9.60 కోట్లతో కమ్యూనిటీ కిచెన్‌

📌 60 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అక్టోబర్‌ 6న శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సూర్యాపేట జిల్లా, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల):సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న వేలాది మంది విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారం అందించేందుకు భారీ కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటు కానుంది. మునగాల మండలంలో రూ.9.60 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక కమ్యూనిటీ కిచెన్‌ నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి అక్టోబర్‌ 6న మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.జిల్లాలోని 1,029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న...