సుప్రసిద్ధ శాస్త్రవేత్త పల్లె రామారావు కన్నుమూత

📌 పద్మ విభూషణ్‌ ప్రొఫెసర్‌ రామారావు (89)కు పలు సంస్థల ఘన నివాళులు మెటలర్జీ, అణు భౌతిక శాస్త్ర రంగాలకు విశేష సేవలు.. దేశానికి తీరని లోటు హైదరాబాద్‌: భారతదేశ అత్యుత్తమ శాస్త్రవేత్తల్లో ఒకరైన పద్మ విభూషణ్‌ ప్రొఫెసర్‌ పల్లె రామారావు (89) కన్నుమూశారు. మెటలర్జీ, మెటీరియల్‌ సైన్స్‌, అణు భౌతిక శాస్త్ర రంగాల్లో విశేష కృషి చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆయన మృతి పట్ల జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు, పలు శాస్త్ర, విద్యా సంస్థలు సంతాపం వ్యక్తం చేశాయి. 1937 జూన్‌ 30న కర్నూలులో జన్మించిన రామారావు ప్రాథమిక విద్యను తెలుగు మాధ్యమంలో పూర్తి చేసి, బెంగళూరు, మద్రాస్‌, ఆంధ్ర,...