గుజరాత్ చేరుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
📌 చింతన్ శివిర్–2026లో పాల్గొననున్న రాష్ట్ర మంత్రి గుజరాత్ : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర అధికారుల బృందం గుజరాత్‌కు చేరుకుంది. గుజరాత్‌లోని ఏక్తానగర్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద అక్టోబర్ 5, 6 తేదీల్లో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన నిర్వహించనున్న చింతన్ శివిర్–2026లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొననున్నారు.రోడ్లు, జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిర్వహించే ఈ శివిర్‌లో వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు పాల్గొననున్నారు.