హుజూర్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ జాగృతి ముఖ్య నాయకుల సమావేశం

📌 తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు జాగృతి కృషి - రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కే మస్తాన్‌. మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపు హుజూర్‌నగర్‌, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన, సేవా కార్యక్రమాల విస్తరణకు తెలంగాణ జాగృతి సంస్థ కృషి చేస్తుందని ఆ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌కే మస్తాన్ అన్నారు.ఆదివారం హుజూర్‌నగర్‌ పట్టణంలో ఎస్‌కే మస్తాన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ తెలంగాణ జాగృతి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన...