ముల్కనూర్ సహకార నమూనా స్ఫూర్తిదాయకం

📌 290 మంది గ్రూప్‌–I, II, III అధికార శిక్షణార్థుల అధ్యయన పర్యటన రైతు కేంద్రిత సేవలు, ఆధునిక విధానాలపై అధికారుల ప్రశంసలు హనుమకొండ జిల్లా, ముల్కనూర్, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): గ్రామీణ ప్రాంతాల్లో సహకార వ్యవస్థ సమర్థవంతమైన నాయకత్వం, సభ్యుల విశ్వాసం, వృత్తిపరమైన నిర్వహణతో ఆర్థిక, సామాజిక మార్పుకు ఎలా దోహదపడుతుందో ముల్కనూర్ సహకార సంఘం ప్రత్యక్షంగా చాటిచెబుతోందని నూతనంగా నియమితులైన ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడ్డారు. డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న తెలంగాణ ప్రభుత్వ నూతన గ్రూప్‌–I, II, III అధికార శిక్షణార్థులు మొత్తం 290 మంది రెండు రోజుల పాటు రెండు విడతలుగా ముల్కనూర్...